Shraddham is a ritual performed in which prayers and food are offered to Pithru devathalu (departed souls) .They are conducted every month through the first year after the death , based on the thithi ( phase of the moon- lunar day ), on the first death anniversary and thereafter once annually. Poor feeding & honoring of Brahmins by offering cash and kind in memory of the departed souls is done.
By performing the pithrupuja on the death anniversary based on the thithi or on Amavasya Pithru devathalu are satiated as well the ones performing the pithrupooja. Therefore, it is customary to perform Shraddha karmas.
Another interesting aspect is the belief that a person who led a pious and pure life would be reborn after his death as the offspring into the same family that sustains the life style of that person. This would help in sustaining the family values and Hindu culture. However it does not mean that those who do not perform these rituals would suffer. The comfort of leading a peaceful life cannot be found elsewhere. Serving the ancestors during their lifetime, performing special rituals after their death and remembering them would get their blessings and inspiration to the generations to come.
Puja duration: 90 minutes
Puja items: Click here
సాధారణంగా ఇంట్లో ఎవరైనా చనిపోతే వారికి నెల నెల మాసికాలు సంవత్సర విమోకం
ప్రతి సంవత్సరం వారు మరణించిన తిథినాడు ఆబ్దికాలు నిర్వహిస్తారు. ఆవిధంగా చేయడం వల్ల వారిని మనం స్మరించుకుని వారి పేరు మీద నలుగురికి అన్నదానం చేయడం, బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులు ఇవ్వడం చేస్తారు.
కాబట్టి వారు మరణించిన తిథి నాడు లేదా అమావాస్యల్లో కాని పితృకార్యాన్ని శ్రాద్ధాన్ని నిర్వహిస్తే పితృదేవతలు సంతృప్తులవుతారు. ఆ కర్మ నిర్వహించినవారు కూడా తృప్తి చెందుతారు. ఆ కారణంగా శ్రాద్ధ కర్మలు నిర్వహించాలనే నియమం ఏర్పడింది. పితృకర్మల విషయంలో ఇంకో విశేషం కూడా ఉంది. ఉన్నతమైన పవిత్రమైన జీవితం గడిపిన ఒక వ్యక్తి మరణానంతరం అతని జీవన విధానం ఆ ఇంట్లో కొనసాగుతూ ఉంటే వారు ఆ ఇంట్లో సంతానంగా జన్మిస్తారనే నమ్మకం ఉంది. అందుకు ఈ పితృ తర్పణాలు ఎంతో ఉపకరిస్తాయి. ఇట్లా మళ్ళీ మళ్ళీ జన్మించడం వల్ల కుటుంబ సంస్కారం విలువలు పడిపోకుండా నిలబడటానికి భారతీయ ధర్మాన్ని కొనసాగించడానికి వీలవుతుంది. అట్లా అని శ్రాద్ధకర్మలు చేయనివాళ్ళంతా పతనం వైపు పయనిస్తారని కాదు. కాని ఒక ప్రశాంతమైన జీవన విధానంలో ఉన్న సుఖం సౌలభ్యం వేరేచోట లభించదు కదా. అందుకే మన పూర్వీకులను తలచుకుని వారికి శ్రాద్ధకర్మలు నిర్వహించి పితృ ఋణం తీర్చుకొని వారి ఆశీస్సులను పొందడం శ్రాద్ధకర్మల నిర్వహణకు ఉన్న సంబంధం. తమ భౌతికదేహానికి మానసిక వికాసానికి కారకులైన వారికి జన్మ ఉన్న సమయంలో సేవ చేసుకోవడం మరణం తర్వాత స్మరించి వారి కోసం ప్రత్యేక అర్చనలు చేయడమే శ్రాద్ధం. దీనిలో శ్రద్ధ ప్రధానం. దీనివల్ల పెద్దల ఆశీస్సులు మార్గదర్శనం తరువాతి తరాలకు లభిస్తుంది.